బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 10:08:02

రామాల‌యం క‌డితే.. క‌రోనా అంతం అవుతుంది

రామాల‌యం క‌డితే.. క‌రోనా అంతం అవుతుంది

హైద‌రాబాద్‌: అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం ప్రారంభం అయితే.. దేశంలో క‌రోనా వైర‌స్ అంతం అవుతుంద‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్రోటెమ్ స్పీక‌ర్, బీజేపీ నేత రామేశ్వ‌ర్ శ‌ర్మ తెలిపారు.  ప్ర‌జాసంక్షేమం కోసం, రాక్ష‌సుల‌ను సంహ‌రించేందుకే శ్రీరాముడు అవ‌త‌రించాడ‌ని, అయోధ్య‌లో రాముడి ఆల‌య నిర్మాణం ప్రారంభం అయిన క్ష‌ణం నుంచే కోవిడ్ మ‌హ‌మ్మారి కూడా క‌నుమ‌రుగు అవుతుంద‌ని శ‌ర్మ అన్నారు. ఒక్క మ‌న దేశ‌మే కాదు, యావ‌త్ ప్ర‌పంచం ఆ వైర‌స్‌తో ఇబ్బందిప‌డుతున్న‌ద‌ని, సోష‌ల్ డిస్టాన్స్ పాటిస్తూ.. ప‌విత్ర మూర్తుల‌ను స్మ‌రిస్తున్నామ‌ని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర‌కార‌మే రామాల‌య నిర్మాణం జ‌రుగుతున్న‌ట్లు చెప్పారు. ఆగ‌స్టు 5వ తేదీన ప్ర‌ధాని మోదీ.. అయోధ్య‌లో రామాల‌య భూమిపూజ‌లో పాల్గొంటార‌ని శ్రీ రామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి తెలిపారు. 


logo