గురువారం 26 నవంబర్ 2020
National - Nov 13, 2020 , 03:47:16

యమునా తీరంలో విశిష్ట కట్టడం

యమునా తీరంలో విశిష్ట కట్టడం

  • డిజైన్లను ఆహ్వానించిన కేంద్రం
  •  సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం

న్యూఢిల్లీ: ఢిల్లీలో కేంద్రం చేపడుతున్న సెంట్రల్‌ విస్టా పునరభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా యమునా తీరంలో ప్రతిపాదిత న్యూ ఇండియా గార్డెన్‌ వద్ద విశిష్ట కట్టడం (ఐకానిక్‌ కట్టడం) నిర్మాణానికి కేంద్రం డిజైన్లు ఆహ్వానిస్తున్నది. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగానే నూతన పార్లమెంట్‌ భవనం, నూతన కేంద్ర సచివాలయం నిర్మిస్తున్నారు. అలాగే రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు 2.9 కిలోమీటర్ల  ప్రాంతాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగానే యమూనాతీరంలో ఒక ఐకానిక్‌ కట్టడాన్ని నిర్మిస్తున్నారు. గరిష్ఠంగా 134 మీటర్ల ఎత్తుతో ఆ కట్టడం టవర్‌ లేదా శిల్పం ఆకృతిలో ఉండొచ్చని కేంద్రం తెలిపింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ విజన్‌ను ప్రతిబింబించేలా ఢిల్లీకి సరికొత్త ప్రతీకగా ఆ కట్టడం డిజైన్లు ఉండాలని కేంద్రం పేర్కొంది.