శుక్రవారం 05 జూన్ 2020
National - May 07, 2020 , 20:12:21

ఆస్పత్రులు తిప్పిపంపిన కానిస్టేబుల్ మృతి

ఆస్పత్రులు తిప్పిపంపిన కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్: ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన 31 సంవత్సరాల అమిత్ రాణా అనే కానిస్టేబుల్ కరోనా బారిన పడి అమరుడయ్యాడు. అతనికి ముందుగా లక్షణాలు కనిపించ లేదు. సోమవారం కొద్దిగా జ్వరం వచ్చింది. ఏవో మందులు వేసుకుని నిద్రపోయాడు. మంగళవారం ఉదయం జ్వరం తగ్గకపోవడంతో అశోక్ విహార్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షలు చేస్తాం కానీ చేర్చుకోం అని చెప్పారు. కానీ ఎలాంటి పరీక్షలు చేయలేదు. తర్వాత బాబాసాహెబ్ అంబేడ్కర్ హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడా చేర్చుకోవడానికి నిరాకరించారు. తర్వాత సీనియర్ అధికారి జోక్యంతో అశోక్ విహార్‌లో చేర్చుకున్నారు. అక్కడ పరీక్షలు జరిపి, ఏవో మందులు ఇచ్చి, ఇంటికి వెళ్లి ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా విశ్రాంతి తీసుకోమని చెప్పి పంపించేశారు. తర్వాత ఆయన పరిస్థితి విషమించడంతో రాంమనోహర్ లోహియా హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. కానీ దురదృష్టవశాత్తు దారిలోనే మరణించాడు. మంగళవారం కానిస్టేబుల్ రాణా మరణించగా బుధవారం పాజిటివ్ ఫలితాలు అందాయి. హర్యానాలోని సోనేపట్‌కు చెందిన రాణా భరత్‌నగర్ పోలీసు స్టేషన్‌లో డ్యూటీ చేస్తున్నాడు. ఆయనకు బార్య, మూడేళ్ల కొడుకు ఉన్నాడు. కరోనా వ్యాధి వల్ల ఢిల్లీ పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ఇదే ప్రథమం. కానిస్టేబుల్ రాణా మృతి పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంతాపం తెలిపారు. నిబంధనల ప్రకారం పోలీసు కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించారు.


logo