మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 11:13:47

మావోయిస్టుల దాడిలో కానిస్టేబుల్‌ హతం

మావోయిస్టుల దాడిలో కానిస్టేబుల్‌ హతం

రాయ్‌పూర్‌: చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు ఓ  కానిస్టేబుల్‌ను హతమార్చారు. సాయుధులైన కొందరు మావోయిస్టులు  రాత్రి కానిస్టేబుల్‌ ఇంటికి వెళ్లి దాడి చేసి కానిస్టేబుల్‌ను కొట్టి చంపారు.  అడ్డువచ్చిన కానిస్టేబుల్‌ తల్లిదండ్రులనూ  గాయపరిచారు. దారుణహత్యకు గురైన కానిస్టేబుల్‌ జాంగ్లా పోలీసు్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల కిత్రమే సెలవుపై కానిస్టేబుల్‌ ఇంటికి వచ్చాడని తెలుసుకున్న మావోయిస్టులు ఈ చర్యకు పాల్పడ్డారు. 


logo