సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 16:04:20

సమస్యలు పరిష్కరించాలని కానిస్టేబుల్‌ గాంధీగిరి

సమస్యలు పరిష్కరించాలని కానిస్టేబుల్‌ గాంధీగిరి

భోపాల్‌: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో సోమవారం పోలీసు కానిస్టేబుల్‌ గాంధీగిరిలో భాగంగా మౌనదిక్ష చేపట్టాడు. కానిస్టేబుల్ పాత పోలీస్‌హెడ్‌క్వార్టర్స్‌ ఎదురుగా ఒక చేతిలో దండతో కళ్ళు మూసుకుని జపించడం ప్రారంభించాడు.  కానిస్టేబుల్ ఈ విధంగా ధ్యానంలో కూర్చునే ముందు సోషల్‌ మీడియాలో ఒక వీడియోను పోస్టు చేశాడు. ఇందులో అతను హెడ్‌ క్వార్టర్స్‌ ఎదురుగా ఇలా కూర్చోడానికి గల కారణాన్ని తెలియజేశాడు. 

మధుసూదన్‌ రాథోడ్‌ అనే ఈ కానిస్టేబుల్‌ వీడియోలో మాట్లాడుతూ ‘‘ పోలీసులకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇవి అందరికీ తెలిసినవే కాని ఎవరూ పట్టించుకోరు. పోలీసులు నిరసనకు దిగలేరు. అలా ఎవరైనా చేసినా వారిని సస్పెండ్‌ చేస్తారు. కానీ అది ఎంతకాలం జరుగుతుంది. నేను పికెట్ చేయను, ప్రదర్శించను, నేను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ బాబా మహాకల్‌ను ప్రార్థిస్తాను, ఆహారం తినడం కూడా మానేస్తాను. పోలీసులు కలత చెందుతున్నారని, వారి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి’’ అని మధు తెలిపాడు.  

సోషల్ మీడియాలో ఈ వీడియోతో పాడు హెడ్‌క్వార్టర్స్‌ ఎదురుగా మధు ధ్యానం చేసే వీడియో వైరల్‌ అయ్యింది. దీంతో జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది  అకడికి చేరుకొని కానిస్టేబుల్‌ను ఒప్పించడానికి ప్రయత్నించారు. ఆ తరువాత అతడిని జీపులో ఎక్కొంచుకొని స్టేషన్‌కు తీసుకెళ్లారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo