గురువారం 04 మార్చి 2021
National - Aug 26, 2020 , 17:36:00

దేశంలో ఉగ్రదాడులకు కుట్ర.. నిఘావర్గాల హెచ్చరిక

దేశంలో ఉగ్రదాడులకు కుట్ర.. నిఘావర్గాల హెచ్చరిక

న్యూఢిల్లీ : దేశంలో ఉగ్రదాడులకు ఐఎస్‌ఐతో కలిసి జైష్‌ ఏ మహమ్మద్‌ కుట్ర పన్నినట్లుగా కేంద్ర నిఘావర్గాలు హెచ్చరించాయి. జమ్మూ కశ్మీర్‌తో పాటు పలు చోట్ల పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు పథకం రచించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్‌ ఇంటిలిజెన్స్‌ సంస్థ ఐఎస్‌ఐ, జైషే మహ్మద్‌ కలిసి ప్రణాళికలు వేశాయని గుర్తించాయి. ఆగస్టు 20న పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఐఎస్‌ఐ అధికారులతో ఉగ్రవాద సంస్థకు చెందిన మహ్మద్‌కు చెందిన మౌలానా అబ్దుల్ రవూఫ్ అజ్ఘర్‌, షకీల్‌ అహ్మద్‌ సమావేశమైనట్లు నిర్ధారించారు. అలాగే సమావేశంలో రౌఫ్‌ సోదరుడు మౌలానా అమ్మార్ కూడా ఉన్నాడని నిర్ధారించారు. ఇస్లామాబాద్‌లోని మర్కజ్‌లో ఉగ్రదాడికి ప్రణాళిక జరిగిందని, ముఫ్తీ అజ్ఘర్‌ ఖాన్‌ కాశ్మీరీ, ఖారీ జారార్‌ రౌఫ్‌ పాలు పంచుకున్నట్లు నిఘావర్గాలకు సమాచారం అందింది.

కాగా, బాలాకోట్‌ దాడుల అనంతరం ఐఏఎఫ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను విడుదల చేసినందుకు, జైషే మహ్మద్‌కు చెందిన తలీమ్‌ ఉల్‌ ఖురాన్‌ మదర్సాను లక్ష్యంగా చేసుకొని భారత్‌ ప్రతీకార దాడులకు పాల్పడగా.. పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను విమర్శిస్తూ మౌలానా అమ్మార్ ఆడియోను విడుదల చేశారు. కాగా, గతేడాది పుల్వామా ఘటన జరగడానికి నెల ముందే ఇదే తరహా సమావేశం నిర్వహించడం గమనార్హం. జేఈఎం దేశంలో ఉగ్రదాడులకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోందని, కాశ్మీర్‌ లోయలో సంస్థకు చెందిన ఉగ్రవాదులను మట్టుబెడుతుండడంతో ప్రతీకారంతో రగిలిపోతుందని నిఘావర్గాలు పేర్కొంటున్నాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo