శుక్రవారం 15 జనవరి 2021
National - Nov 27, 2020 , 17:08:03

హిందూ యువ‌తుల‌ను మీ చెల్లెళ్లు అనుకోండి!

హిందూ యువ‌తుల‌ను మీ చెల్లెళ్లు అనుకోండి!

మొరాదాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన మొరాదాబాద్ ఎంపీ ఎస్టీ హ‌స‌న్ ముస్లిం యువ‌కుల‌కు ఓ స‌ల‌హా ఇచ్చారు. హిందూ యువ‌తులంద‌రినీ మీ చెల్లెళ్లు అనుకోండి అని సూచించారు. యోగి ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ల‌వ్ జిహాద్ ఆర్డినెన్స్‌ను ఓ పొలిటిక‌ల్ స్టంట్‌గా అభివ‌ర్ణించారు. మ‌న దేశంలో మ‌తంతో సంబంధం లేకుండా జీవిత భాగ‌స్వాముల‌ను ఎంచుకుంటారు. హిందువులు, ముస్లింల‌ను.. ముస్లింలు హిందువుల‌ను పెళ్లిళ్లు చేసుకుంటారు. కాక‌పోతే చాలా త‌క్కువ‌గా జ‌రుగుతుంటాయి. ల‌వ్ జిహాద్ కేసుల‌నే తీసుకుంటే.. ఆ యువ‌కులు ముస్లింలు అని యువ‌తుల‌కు ముందే తెలుసు. కానీ స‌మాజం నుంచి వ‌చ్చే ఒత్తిళ్ల కార‌ణంగా వాళ్లు ముస్లింల‌ని త‌మ‌కు తెలియ‌ద‌ని అమ్మాయిలు చెబుతారు. దానికే లవ్ జిహాద్ అని పేరు పెడ‌తారు అని హ‌స‌న్ అన్నారు. అందుకే హిందూ యువ‌తులంద‌రినీ ముస్లిం అబ్బాయిలు త‌మ సోద‌రీమ‌ణులుగా చూడాల‌ని స‌ల‌హా ఇచ్చారు. లేదంటే ఓ చ‌ట్టం రెడీ అయింది. దీని కార‌ణంగా మిమ్మ‌ల్ని దారుణంగా హింసిస్తారు. మిమ్మ‌ల్ని మీరు ర‌క్షించుకోండి. ప్రేమ జోలికి వెళ్ల‌కండి అని హ‌స‌న్ అన‌డం విశేషం.