జెనీవా, ఏప్రిల్ 13: మాంసాహార మార్కెట్లలో అడవిజంతువుల విక్రయాలను నిలిపివేయాలని వివిధ దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సూచించింది. మనుషుల్లో వైరస్ వ్యాధులకు 70 శాతానికి పైగా అటువంటి వన్యప్రాణులే కారణమని కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది. చైనాలో గబ్బిలాల నుంచి ఇతర జంతువుల ద్వారా మనుషులకు కరోనా వైరస్ సోకిందన్న అనుమానాలు ఉన్నాయి. మొదట చైనాలోని వూహాన్ నగరంలో కరోనా బయటపడిన సంగతి తెలిసిందే.