శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 13:00:31

ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం

ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యెడియురప్ప ప్రభుత్వంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణలో యెడియురప్ప ప్రభుత్వం వైఫల్యంపై కాంగ్రెస్‌ పార్టీ గురువారం సభలో అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. సీఎం యెడియురప్ప శుక్రవారం దీనిపై స్పందించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని, అప్పుడు తాను మరో ఆరు నెలల వరకు సేఫ్‌గా ఉంటానని ఆయన ఎద్దేవా చేశారు. మరోవైపు అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్‌లోని మిత్రులెవరూ తనను సంప్రదించలేదని జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. తమ మద్దతు అవసరం లేదని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తున్నదని ఆయన చెప్పారు. ఒంటరిగానే పోరాడాలని కాంగ్రెస్‌ పార్టీ అనుకుంటున్నదని కుమారస్వామి వ్యాఖ్యానించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్­లోడ్ చేసు­కోండి