శనివారం 30 మే 2020
National - May 22, 2020 , 19:32:06

కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధికి కరోనా

కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధికి కరోనా

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ ఝాకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఇంతవరకు తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేనప్పటికి, కరోనా పాటివ్‌ అని తేలిందని చెప్పారు. వచ్చే పది పన్నెండు రోజులు మంబైలోని తన ఇంట్లో క్వారంటైన్‌లో ఉంటానని తెలిపారు. కరోనా వ్యాప్తి లక్షణాలను తక్కువగా అంచనా వేయకూడదని, మనందరికి ప్రమాదం పొంచి ఉందన్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. 


logo