e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News కొవిడ్-19 : పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల‌పై రాష్ట్ర‌ప‌తికి కాంగ్రెస్ లేఖ‌

కొవిడ్-19 : పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల‌పై రాష్ట్ర‌ప‌తికి కాంగ్రెస్ లేఖ‌

కొవిడ్-19 : పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల‌పై రాష్ట్ర‌ప‌తికి కాంగ్రెస్ లేఖ‌

న్యూఢిల్లీ : క‌రోనా సంక్షోభంపై చ‌ర్చించేందుకు పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాలు ఏర్పాటు చేయాల‌ని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రి రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ కు సోమ‌వారం లేఖ రాశారు. ఎంపీలు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితిని ప్ర‌భుత్వానికి తెలిపేందుకు పార్ల‌మెంట్ స‌మావేశాలు ఉప‌క‌రిస్తాయ‌ని ఆయ‌న త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడేందుకు ఎలాంటి చర్య‌లు చేప‌ట్టాల‌నే దానిపై చ‌ర్చించేందుకు పార్లమెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల ఏర్పాటుకు చొర‌వ తీసుకోవాల‌ని లేఖ‌లో రాష్ట్ర‌ప‌తికి కాంగ్రెస్ ఎంపీ విజ్ఞ‌ప్తి చేశారు. మ‌రోవైపు క‌రోనా క‌ట్ట‌డిలో న‌రేంద్ర మోదీ స‌ర్కార్ ఘోరంగా విఫ‌ల‌మైంద‌ని అంతకుముందు సీడ‌బ్ల్యూసీ భేటీ తీర్మానించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొవిడ్-19 : పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల‌పై రాష్ట్ర‌ప‌తికి కాంగ్రెస్ లేఖ‌

ట్రెండింగ్‌

Advertisement