మరికాసేపట్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం శుక్రవారం జరుగనుంది. ఉదయం 10.30గంటలకు ప్రారంభం కానుండగా.. వర్చువల్ విధానంలో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నికపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రైతు ఉద్యమం సహా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి అనంతరం కాంగ్రెస్ చీఫ్ పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అనంతరం సీడబ్ల్యూసీ సోనియా గాంధీకి తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. బిహార్ అసెంబ్లీతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
ఈ క్రమంలో గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ సహా సీనియర్ నాయకులు పార్టీని పునర్వ్యవస్థీకరించాలని, పూర్తిస్థాయి అధ్యక్షుడిని నియమించాలని డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ నాయకుల్లో మెజారిటీ నాయకులంతా రాహుల్ గాంధీ సైతం పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుతున్నారు. 99.99 శాతం మంది కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ మళ్లీ తమకు నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా ఇటీవల చెప్పారు. అయితే పలు సార్లు రాహుల్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు విముఖ వ్యక్తం చేశారు. గత సీడబ్ల్యూసీ భేటీలో పార్టీ అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తానని పేర్కొన్నారు.
ఇవాళ జరిగే సమావేశంలో రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రాహుల్ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రాకుంటే పార్టీలో సీనియర్ నేత అయిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు బాధ్యతలు అప్పగించాలని సోనియా భావిస్తున్నట్లు సమాచారం. ఆయన సైతం సీఎం పీఠాన్ని వదిలి.. ఢిల్లీకి వచ్చేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. అయితే పార్టీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక తేదీ, పార్టీ ప్లీనరి సమావేశంపై ఇవాళ జరిగే సీడబ్ల్యూసీ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
- ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్
- దర్శకుడికే టోకరా వేసిన కేటుగాడు
- ట్రక్కు బోల్తా.. ఆరుగురు మృతి.. 15 మందికి గాయాలు
- ఎల్లో డ్రెస్‌లో అదరగొడుతున్న అందాల శ్రీముఖి..!
- లారీని ఢీకొట్టిన కారు.. నలుగురి దుర్మరణం
- నా రేంజ్ మీకు తెలుసా అంటూ షణ్ముఖ్ వీరంగం..!
- రాజశేఖర్ కూతురు తమిళ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
- బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్
- డేటా చోరీ గిఫ్ట్‌ల పేర బురిడీ..!
- షూటింగ్లో ప్రమాదం.. హీరోకు గాయాలు