మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 12:50:22

కాంగ్రెస్ ట్వీట్స్ పార్టీగా మిగిలిపోతుంది..

కాంగ్రెస్ ట్వీట్స్ పార్టీగా మిగిలిపోతుంది..

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ట్వీట్స్ పార్టీగా మిగిలిపోతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రతి రోజు ట్వీట్ చేస్తున్నారంటూ ఈ మేరకు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ సరిగా పనిచేయకపోవడం వల్లనే ఒక రాష్ట్రం తర్వాత మరోరాష్ట్రంలో అధికారం కోల్పోతున్నదని ఆయన చెప్పారు. ప్రజల నుంచి తిరస్కరణకు గురైన ఆ పార్టీ కేంద్రంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నదని, అయితే ఇందులో సఫలం కాలేదన్నారు.

గత ఆరు నెలలుగా రాహుల్ గాంధీ సాధించిన అంశాలు తమకు తెలుసని జవదేకర్ అన్నారు. ఫిబ్రవరిలో ఢిల్లీ, షహీన్ బాగ్  అల్లర్లు, మార్చిలో సింధియాతోపాటు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని కోల్పోవడం, ఏప్రిల్‌లో వలస కార్మికులను రెచ్చగొట్టడం, మే నెలలో ఆ పార్టీ చారిత్రక ఓటమికి గురై ఆరోవ ఏట అడుగుపెట్టడం, జూన్‌లో చెనాకు మద్దతివ్వడం, జూలైలో రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ నాశనం కావడం . రాహుల్ గాంధీ గత ఆరు నెలల్లో సాధించినవి ఇవేనంటూ జవదేకర్ ఎద్దేవా చేశారు.

ఒకవైపు కరోనా సంక్షోభంతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే మరోవైపు ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చి అధికారంలోకి వచ్చేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ ప్రయత్నిస్తున్నదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ మేరకు కౌంటర్ ఇచ్చారు.


logo