జేడీఎస్‌ను కూల్చాలని చూస్తున్న కాంగ్రెస్: దేవేగౌడ

బెంగళూరు: కర్ణాటకలో ఒకప్పుడు భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, జేడీఎస్‌లు పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ జేడీఎస్‌ను కూల్చలని చూస్తున్నదని ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వంలో జేడీఎస్‌ను కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ పార్టీని ఎవరూ నాశనం చేయలేరని వెల్లడించారు. జేడీఎస్‌కు బలమైన మూలాలున్నాయని, సొంతంగా నిలబడగలు గుతుందని చెప్పారు. 2023లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు.
తాను ఉన్నంత కాలమే కాదు, తర్వాత కూడా జేడీఎస్ సుస్థిరంగా ఉంటుందన్నారు. ఉత్సాహం, విశ్వాసం ఉన్న కార్యకర్తలు తమకు అండగా ఉన్నారని పార్టీని మళ్లీ బలోపేతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో జేడీఎస్ విలీనమవుతుందనే వదంతులను కొందరు తమ సరదాకోసం సృష్టించినవేనని చెప్పారు. ఎప్పటికీ అలాంటి ప్రతిపాదన ఉండబోదని చెప్పారు.
కర్ణాటకలో ఏడాదిన్నరపాటు అధికారాన్ని పంచుకున్న కాంగ్రెస్, జేడీఎస్ మధ్య విభేదాలు వచ్చాయి. పార్టీ నేతలు గత కొంతకాలంగా పరస్పర ఆరోపణలు చేసుకుటున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీతో కలిసినందువల్ల తనపై ప్రజలకున్న నమ్మకం పోయింనది, తాము చాలా కోల్పోయామని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి ప్రకటించారు. దీనికి ప్రతిగా 30 సీట్లు గెలుచుకున్న పార్టీకి సీఎం పీఠం అప్పగించామని, ఎవరు ఎవరివల్ల లబ్ధిపొందారో, ఎవరు నష్టపోయారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నేత సిద్ధరామయ్య వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
- ఏపీలో కొత్తగా 137 కొవిడ్ కేసులు
- హెచ్-1బీపై ట్రంప్.. జో బైడెన్ వైఖరి ఒకటేనా?!
- నరేంద్ర చంచల్ మృతి.. ప్రధాని సంతాపం
- గంటవ్యవధిలో భార్యాభర్తల ఆత్మహత్య..
- లాలూ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆసుపత్రికి కుటుంబం
- వాహనదారులకు భారం కావొద్దనే వాహన పన్ను రద్దు
- మందిర్ విరాళాల స్కాం : ఐదుగురిపై కేసు నమోదు
- మహా సర్కార్ లక్ష్యంగా పీఎంసీ దర్యాప్తు: ఎమ్మెల్యే ఇండ్లపై ఈడీ దాడులు
- గౌడ సంఘాల నాయకులకు జీఓ కాపీ అందించిన మంత్రి
- రైల్వే లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి హరీశ్ రావు