శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 19, 2020 , 18:23:55

గుప్కార్‌ కూటమిపై కాంగ్రెస్‌ స్పష్టతనివ్వాలి : సీఎం యోగి

గుప్కార్‌ కూటమిపై కాంగ్రెస్‌ స్పష్టతనివ్వాలి : సీఎం యోగి

లక్నో : గుప్కార్ కూటమిపై కాంగ్రెస్‌ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జమ్ము కశ్మీర్‌ కాంగ్రెస్‌ నాయకులు గుప్కార్‌ సమావేశాలకు హాజరవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ కశ్మీర్‌లో ఒకలా.. ఢిల్లీలో మరోలా వ్యవహరిస్తుందని ఆక్షేపించారు. జమ్ముకశ్మీర్‌ విషయంలో కాంగ్రెస్‌ ధ్వంద్వ వైఖరి అవలంభిస్తుందని ఆరోపించారు.

ఉగ్రవాదానికి, ఏర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తూ కాంగ్రెస్‌ జాతిఐక్యత, సమగ్రతతో ఆటలాడుతుందని మండిపడ్డారు. జమ్ము కశ్మీర్‌లో గుప్కార్‌ సమావేశానికి కాంగ్రెస్‌ నాయకులు హాజరుకావడంతో ఆ పార్టీ తీరు అర్థమైందని అన్నారు. గుప్కార్‌ కూటమిపై కాంగ్రెస్‌ అధిష్ఠానం తన వైఖరి తెలియజేయాలని, ఆర్టికల్‌ 370పై స్పష్టత నివ్వాలని దేశ ప్రజలు భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్‌లో అభివృద్ధి పనులకు కాంగ్రెస్‌ అడ్డుపడుతుందని ఆరోపించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.