మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 08:39:23

మాకు 109 మంది ఎమ్మెల్యేల బలం ఉంది!

మాకు 109 మంది ఎమ్మెల్యేల బలం ఉంది!

జైపూర్‌: సంక్షోభం అంచున ఉన్న ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తమకు 109 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, గెహ్లాట్‌ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ తిరుబాటు నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి 2.30 గటలకు సీఎం గెహ్లాట్‌ ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించింది. 

సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నామని, కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీల నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉన్నదని 109 మంది ఎమ్మెల్యేలు రాతపూర్వకంగా ఇచ్చారని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి అవినాశ్‌ పాండే ప్రకటించారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు సీఎంతో ఫోన్‌లో మాట్లాడారని, సోమవారం ఉదయం వారు కూడా సంతకాలు చేయనున్నారని వెల్లడించారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు సీఎల్సీ సమావేశం జరుగుతుందని, ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా హాజరుకావాలని, ఈ మేరకు విప్‌ జారీ చేశామని తెలిపారు. సరైన కారణం చూపకుండా గైర్హాజరయ్యేవారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.   

కాగా, రాజస్థాన్‌ ప్రభుత్వం మైనార్టీలో పడిందని అసంతృప్త నేత రాసచిన్‌ పైలట్‌ ఆదివారం రాత్రి ప్రకటించారు. తాను సీఎల్సీ సమావేశానికి హాజరుకావడం లేదని వెల్లడించారు. తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతుందని ప్రకటించారు.    

రాజస్థాన్‌ అసెంబ్లీలో 200 మంది సభ్యులు ఉన్నారు. అందులో కాంగ్రెస్‌ 107 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. 13 మంది ఇండిపెండెంట్లు, మరో ఐదుగురు వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సర్కారుకు మద్దతిస్తున్నారు. ప్రతిపక్ష బీజేపీకి 72 మంది, రాష్ట్రీయ లోక్‌మాంత్రిక్‌ పార్టీకి ముగ్గురు సభ్యులు ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 101 మంది సభ్యుల బలం ఉండాలి. అసంతృత్ప నేత సచిన్‌ పైలట్‌ 30 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీనుంచి చీల్చితే గెహ్లాట్‌ ప్రభుత్వం కూలిపోయినట్లే! 


logo