శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 22:01:43

సోనియాగాంధీకి స్వల్ప అస్వస్థత

సోనియాగాంధీకి స్వల్ప అస్వస్థత

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గురువారం రాత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను సర్ గంగా రామ్ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని దవాఖాన వర్గాలు ధ్రువీకరించాయి. "సాధారణ వైద్య పరీక్షల" నిమిత్తం సోనియాగాంధీ గురువారం రాత్రి 7 గంటల సమయంలో చేర్చినట్లు మెడికల్ బులెటిన్ లో సర్ గంగారామ్ దవాఖాన తెలిపింది.

"ఆమెను సాధారణ పరీక్షలు, పరిశోధనల కోసం చేర్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉంది" అని దవాఖాన చైర్మన్ డాక్టర్ డీఎస్ రానా చెప్పారు. గతంలో అనారోగ్యానికి గురైన సోనియాగాంధీ విదేశాల్లో వైద్యం చేయించుకున్న విషయం తెలిసిందే.

ఇవాళ ఉదయం పార్టీ రాజ్యసభ ఎంపీల సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ప్రస్తుత రాజకీయ సమస్యలపై 3 గంటలకుపైగా ఈ సమావేశంలో చర్చించారు.


logo