బుధవారం 08 జూలై 2020
National - Jun 19, 2020 , 07:38:13

అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతాం

అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతాం

ఇంఫాల్‌: మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత ఇబోబి సింగ్‌ చెప్పారు. ఇందులో భాగంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతామన్నారు. స్పీకర్‌ ఖేమ్‌చంద్‌ను పదవి నుంచి తొలిగించాలని అసెంబ్లీ కార్యదర్శికి నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న నేషనల్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన నలుగురు మంత్రులు, బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే, ఒక ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే కూడా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో మణిపూర్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్నది.


logo