మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Mar 07, 2020 , 18:06:31

మార్చి 12 నుంచి కాంగ్రెస్‌ ‘గాంధీ సందేశ్‌ యాత్రా’..

మార్చి 12 నుంచి కాంగ్రెస్‌ ‘గాంధీ సందేశ్‌ యాత్రా’..

న్యూఢిల్లీ: మార్చి 12 నుంచి కాంగ్రెస్‌ పార్టీ  ‘గాంధీ సందేశ్‌ యాత్ర’  చేపట్టనున్నది. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించి ఈ నెల 12తో 90 సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ చారిత్రక రోజుతో కాంగ్రెస్‌ పార్టీ.. గాంధీ సందేశ్‌ యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టనున్నది. గాంధీ జన్మస్థలమైన అహ్మదాబాద్‌ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు.. ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల సీఎంలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారు. ఏప్రిల్‌ 6న దండిలో ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. logo