ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 07, 2020 , 14:03:31

క‌ర్ణాట‌క‌లో ఉపఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ అభ్య‌ర్థులు ఖ‌రారు

క‌ర్ణాట‌క‌లో ఉపఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ అభ్య‌ర్థులు ఖ‌రారు

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క‌లో ఖాళీగా ఉన్న రెండు అసెంబ్లీ స్థానాలకు జ‌రుగ‌నున్న ఉపఎన్నిక‌ల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను ఖరారు చేసింది. సైరా నియోజ‌క‌వ‌ర్గానికి టీబీ జ‌య‌చంద్ర‌, రాజ‌రాజేశ్వ‌రిన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి హెచ్ కుసుమ పేర్లు ఖ‌రార‌య్యాయి. క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీ ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న చేసింది. దేశ‌వ్యాప్తంగా 57 అసెంబ్లీ స్థానాల‌కు నంబ‌ర్ 3, 7 తేదీల్లో ఉపఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. అయితే, క‌ర్ణాట‌క‌లో రెండు స్థానాల‌కు మాత్రం న‌వంబ‌ర్ 3న ఓటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తోపాటు అన్ని రాష్ట్రాల ఉపఎన్నిక‌ల ఫ‌లితాలు నవంబ‌ర్ 10న వెల్ల‌డికానున్నాయి.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.