మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Aug 29, 2020 , 01:48:48

కరోనాతో కాంగ్రెస్‌ ఎంపీ వసంతకుమార్‌ మృతి

కరోనాతో కాంగ్రెస్‌ ఎంపీ వసంతకుమార్‌ మృతి

చెన్నై: కరోనాతో తమిళనాడు కాంగ్రెస్‌ ఎంపీ వసంతకుమార్‌ (70) కన్నుమూశారు. చికిత్స కోసం చెన్నైలోని అపోలో దవాఖానలో చేరిన ఆయన ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం చనిపోయారు. వసంతకుమార్‌ కన్యాకుమారి స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. సోదరుడు చనిపోయిన వార్త విన్న అన్న, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తండ్రి కుమరి అనంతన్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే  నగరంలోని ఓ దవాఖానకు తరలించారు. ఎంపీ వసంతకుమార్‌ గవర్నర్‌ తమిళిసైకి స్వయాన చిన్నాన్న. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


logo