గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 03, 2020 , 02:36:47

నాపై దాడి చేశారు

నాపై దాడి చేశారు

సోమవారం లోక్‌సభలో అధికార, విపక్ష పార్టీ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో బీజేపీ మహిళా ఎంపీ జాస్‌కౌర్‌ మీనా తనపై దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్‌ దళిత మహిళా ఎంపీ రమ్యా హరిదాస్‌.. స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు, ఢిల్లీ మత ఘర్షణలపై పార్లమెంటులో చర్చించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించట్లేదని కాంగ్రెస్‌ ఆరోపించింది.


వారిని బహిష్కరించండి

తమతో ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఎంపీలు అనుచితంగా ప్రవర్తించారని బీజేపీ మహిళా ఎంపీలు ఎదురుదాడికి దిగారు. వారిపై బహిష్కరణ వేటు వేసి గట్టి చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు. కాంగ్రెస్‌ ఎంపీలు సభలో గూండాలుగా ప్రవర్తిస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ విమర్శించారు.
logo
>>>>>>