గురువారం 22 అక్టోబర్ 2020
National - Aug 03, 2020 , 12:12:43

కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరానికి క‌రోనా

కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరానికి క‌రోనా

చెన్నై: ‌కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబ‌రం కుమారుడు, త‌మిళ‌నాడులోని శివ‌గంగ లోక్‌స‌భ ఎంపీ కార్తి చిదంబ‌రం క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. క‌‌రోనా ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని, పాజిటివ్‌గా తేలింద‌ని చెప్పారు. వైద్యుల సూచ‌న‌తో గృహ నిర్బంధంలో ఉన్నాన‌ని తెలిపారు. ఈ మ‌ధ్య కాలంలో త‌న‌తో సన్నిహితంగా మెలిగిన‌వారు మెడిక‌ల్ ప్రొటోకాల్ పాటించాల‌ని చెప్పారు. 

ఆదివారం ఉద‌యం అమిత్‌షా, త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ బ‌న్వ‌రీలాల్ పురోహిత్ క‌రోనా పాజిటివ్‌లుగా తేలారు. నిన్న రాత్రి క‌ర్ణాట‌క ముఖ్య‌మంతి బీఎస్ యెడియూర‌ప్ప‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులకు కూడా క‌రోనా సోకింది. దీంతో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ త‌ర్వాత క‌రోనా బారిన‌ప‌డిన రెండో ముఖ్య‌మంత్రిగా యెడియూర‌ప్ప నిలిచారు. 


logo