బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 12, 2020 , 22:17:15

బీజేపీలో చేరిన ఎమ్మెల్యే ప్రద్నూమ్న సింగ్‌ లోధీ

బీజేపీలో చేరిన ఎమ్మెల్యే ప్రద్నూమ్న సింగ్‌ లోధీ

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మరొకరు కమలదళంలో చేరారు. ఛత్తార్‌పూర్‌ జిల్లా బడా మల్హెర నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రద్నూమ సింగ్‌ లోధీ ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. శనివారమే ఎమ్మెల్యే పదవికి రాజీమానా చేసిన ఆయన మల్హెర ప్రాంత అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని నమ్మి ఆ పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.

లోధీ రాజీనామాతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 91కి తగ్గింది. ఈ ఏడాది మార్చిలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జ్యోతిరాధిత్య సింథియా  ఆ పార్టీకి రాజీమానా చేయడంతో ఆయన బాటలోనే మరో 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడారు. దీంతో నాటకీయ పరిణామాల మధ్య రాష్ట్రంలో కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోయింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా బీజేపీకి మద్దతు పలకడంతో మార్చి 23న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. 

తాజావార్తలు


logo