గురువారం 09 జూలై 2020
National - Jun 17, 2020 , 18:47:46

'చైనా ఆక్ర‌మించిన ప్ర‌తి అంగుళం భూమిని వెన‌క్కు తేవాలి'

'చైనా ఆక్ర‌మించిన ప్ర‌తి అంగుళం భూమిని వెన‌క్కు తేవాలి'

డెహ్రాడూన్‌: ‌భార‌త్‌ నుంచి చైనా ఆక్రమించిన ప్రతి అంగుళం భూమిని వెనక్కు తేవాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో చైనా దురాగతానికి ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల‌ త్యాగాలను వృథా కానీయరాదని ఆయ‌న‌ పేర్కొన్నారు. మ‌న సైనికుల‌కు యావ‌త్ భార‌త ప్ర‌జ‌లు అండ‌గా ఉన్నార‌ని రావ‌త్ చెప్పారు.

'భారత్‌కు చైనా వెన్నుపోటు పొడిచింది. లఢ‌ఖ‌లోని గాల్వాన్ లోయలో 20 మంది భారత జవాన్ల‌ను చైనా సైన్యం హ‌త్య‌చేసింది. మన సాహస జవాన్ల త్యాగాలను వృథా కానీయరాదు. మన సాయుధ బలగాలకు యావద్దేశ ప్రజలు అండగా ఉన్నారు' అని రావత్ పేర్కొన్నారు. 1971లో ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ పుట్టడానికి భారత్ కారణమ‌నే విషయం శత్రు దేశాల‌న్నిటికీ తెలుసని, 1965, 1999ల్లో పాకిస్థాన్‌‌ బలగాలను  భార‌త సైన్యం వారి భూభాగాల్లోకి తరిమికొట్టిందని, ఇప్పుడు కూడా చైనా అక్ర‌మించిన ప్రతి అంగుళం భూమిని భారత్ వెనక్కు తీసుకుంటుంద‌ని రావ‌త్ ధీమా వ్య‌క్తం చేశారు.


logo