గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 18, 2020 , 02:07:52

ఆర్థిక సునామీ రాబోతున్నది!

ఆర్థిక సునామీ రాబోతున్నది!

-కరోనాతోపాటు దానినీ ఎదుర్కోవాలి

-లేదంటే కోట్లాది మందిపై దారుణ ప్రభావం

-కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ హెచ్చరిక

న్యూఢిల్లీ, మార్చి 17: కరోనా వైరస్‌తోపాటు ఆర్థిక విధ్వంసాన్ని ఎదుర్కొనేందుకు భారత్‌ తప్పనిసరిగా సిద్ధం కావాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. దేశంపైకి దూసుకొస్తున్న ‘ఆర్థిక సునామీ’ వల్ల జరిగే వినాశనం కోట్ల మంది ప్రజలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంట్‌ బయట ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ కండ్లు తెరువాలని.. ఆర్థిక సంక్షోభంతో దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘భారత ఆర్థిక వ్యవస్థ విధ్వంసానికి గురి కానున్నది. ఇది సునామీలా దూసుకొస్తున్నది’ అని రాహుల్‌ హెచ్చరించారు. గతంలో సునామీ రాకముందు అండమాన్‌ నికోబార్‌ దీవుల పరిధిలో సముద్ర తీరంలో జలాలు తగ్గుముఖం పట్టాయని, కానీ, ఆ హెచ్చరికల గురించి తెలియని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లాక సునామీ వచ్చిందని వివరించారు.


logo