గురువారం 09 జూలై 2020
National - Jun 16, 2020 , 19:38:44

ప్ర‌ధాని 56 అంగుళాల ఛాతీ ఏమ‌య్యింది?: క‌పిల్ సిబ‌ల్‌

ప్ర‌ధాని 56 అంగుళాల ఛాతీ ఏమ‌య్యింది?: క‌పిల్ సిబ‌ల్‌

న్యూఢిల్లీ: ల‌ఢ‌క్ స‌రిహ‌ద్దుల్లో చైనా కయ్యానికి కాలు దువ్వుతున్నా ప్రధాని న‌రేంద్ర‌మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్ సీయర్‌నేత కపిల్ సిబల్ ప్రశ్నించారు. స‌రిహ‌ద్దుల్లో అల‌జ‌డి జ‌రిగిన ప్ర‌తిసారి చైనాకు ధీటుగా సమాధానం చెప్పడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైందంటూ బీజేపీ ప్రచారం చేసేదని, మ‌రి ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్ర‌భుత్వం ఏం చేస్తున్న‌ద‌ని ఆయ‌న నిల‌దీశారు. చైనా విష‌యంలో చర్యలు తీసుకోవ‌డంలో మోదీ ప్ర‌భుత్వం ఎందుకు వెనుకాడుతోందని సిబ‌ల్ ప్ర‌శ్నించారు. 

చైనా సైన్యం భారత భూభాగాలను ఆక్రమిస్తూ దురాగతాల‌కు పాల్పడుతున్నా ప్రధాని మోదీకి ఏమాత్రం పట్టడంలేదని, ఆయన 56 అంగుళాల ఛాతీ ఇప్పుడు ఏమ‌య్యింద‌ని కపిల్ సిబల్ ఎద్దేవాచేశారు. మరో పక్క నేపాల్ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌డం విడ్డూరంగా ఉందని అసహనం వ్యక్తంచేశారు. ప్ర‌ధాని మోదీ రెండు నాలుకల ధోరణి అవలంబింస్తున్నారని, అది దేశ అభివృద్దికి నష్టం కలిగిస్తుందనీ సిబ‌ల్‌ విమర్శించారు.


logo