బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 10, 2020 , 12:22:53

కాంగ్రెస్‌కు జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా

కాంగ్రెస్‌కు జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో రాజకీయం అనేక మలుపులు తిరుగుతోంది. కమల్‌నాథ్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. ఆ పార్టీ అసంతృప్త నేత, మాజీ ఎంపీ  జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.  పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.  రాజీనామా లేఖను కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు.  అంతకుముందు  సింధియా.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.   

ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ నివాసంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు సీనియర్‌ నేతలతో అత్యవసరంగా భేటీ అయ్యారు.  మరోవైపు కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సమావేశమయ్యారు. భోపాల్‌లో బీజేపీ సీనియర్‌ నేతల సమావేశం జరుగుతోంది. మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, సీనియర్‌ నేతలు వీడీ శర్మ, వినయ్‌ సహస్రబుద్ధి కీలక భేటీ నిర్వహించారు.   సాయంత్రం 7 గంటలకు భోపాల్‌లో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. 


logo