గురువారం 26 నవంబర్ 2020
National - Nov 06, 2020 , 11:36:51

నితీష్ ఓట‌మిని అంగీక‌రించారు : చిదంబ‌రం

నితీష్ ఓట‌మిని అంగీక‌రించారు : చిదంబ‌రం

న్యూఢిల్లీ : ఈ ఎన్నిక‌లే త‌న‌కు చివ‌రి ఎన్నిక‌లు అని నితీష్ కుమార్ ప్ర‌క‌టించుకోవ‌డంతో.. త‌న ఓట‌మిని అంగీక‌రించార‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు పీ చిదంబ‌రం పేర్కొన్నారు. ఒక వేళ త‌న పాల‌న‌ను ప్ర‌జ‌లు ఆద‌రిస్తే ఆయ‌న ఆ వ్యాఖ్య‌లు చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఇవే త‌న‌కు చివ‌రి ఎన్నిక‌లు అన‌డంలో కుట్ర ఉంద‌న్నారు. త‌న ప‌ని ఆధారంగా ప్ర‌జ‌ల‌ను ఓట్లు వేయాల‌ని కోర‌డం లేద‌ని చెప్పారు. నితీష్ బీహార్‌ను అభివృద్ధి చేయ‌లేదు.. ప్ర‌జ‌లే ఆయ‌న‌కు త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని చిదంబ‌రం పేర్కొన్నారు. 

బీహార్‌ అసెంబ్లీ ఎన్ని‌కల ప్రచారం ఆఖరు రోజున సీఎం నితీశ్‌ కుమార్‌ సంచ‌లన ప్రక‌టన చేశారు. ఈ అసెంబ్లీ ఎన్ని‌కలే తనకు చివరి ఎన్ని‌క‌లని ప్రక‌టిం‌చారు. ముగింపు బాగుం‌డా‌లని కోరు‌కుం‌టు‌న్నట్టు పేర్కొ‌న్నారు. జేడీ‌యూకే మద్దతు తెలిపి మళ్లీ అధి‌కా‌రాన్ని అందిం‌చా‌లని ఓట‌ర్లను కోరారు. ఎన్ని‌కల ప్రచారం మరో గంటలో ముగు‌స్తుం‌ద‌నగా నితీశ్‌ కుమార్‌ సెంటి‌మెం‌ట్‌తో ఓట‌ర్లను ఆక‌ర్షించే ప్రయత్నం చేశారు. ‘తాను అల‌సి‌పో‌యి‌నట్టు నితీ‌శ్‌‌కు‌మా‌ర్‌కు అర్థ‌మైంది. అతను బీహార్‌ బాగో‌గులు చూడ‌లేరు. క్షేత్ర‌స్థా‌యిలో పరి‌స్థితి తెలి‌సి‌నం‌దు‌వల్లే విర‌మిం‌చు‌కుం‌టు‌న్నా‌నని చెప్తు‌న్నారు’ అని విప‌క్షాల కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ విమ‌ర్శిం‌చారు.