బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 04, 2020 , 11:43:01

అధీర్‌ రంజన్‌ కార్యాలయంపై దాడి

అధీర్‌ రంజన్‌ కార్యాలయంపై దాడి

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరి కార్యాలయంపై నిన్న సాయంత్రం దాడి జరిగింది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఢిల్లీలోని ఎంపీ కార్యాలయానికి చేరుకుని అక్కడున్న సిబ్బందిని దూషించారు. అనంతరం చౌదరి ఆఫీసును ధ్వంసం చేశారు. ఎంపీ చౌదరితో ఫోన్‌ మాట్లాడాలని, అతని కాంటాక్ట్‌ వివరాలు ఇవ్వాలని ఆఫీసు సిబ్బందిని ఆ నలుగురు అడిగారు. చౌదరి వివరాలు ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరించడంతో.. కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఎంపీ ఆఫీసు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.


logo