బుధవారం 08 జూలై 2020
National - Jun 26, 2020 , 18:34:55

కాంగ్రెస్ లీడ‌ర్ అభిషేక్ సింఘ్వీకి క‌రోనా పాజిటివ్

కాంగ్రెస్ లీడ‌ర్ అభిషేక్ సింఘ్వీకి క‌రోనా పాజిటివ్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్, రాజ్య‌స‌భ ఎంపీ అభిషేక్ మ‌ను సింఘ్వీకి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. సింఘ్వీలో క‌రోనా ల‌క్ష‌ణాలు చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ.. ఆయ‌న‌కు క‌రోనా ఫ‌లితం పాజిటివ్ వ‌చ్చింది. అభిషేక్ సింఘ్వీ జులై 9వ తేదీ వ‌ర‌కు హోం క్వారంటైన్ లో ఉండ‌నున్నారు. కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ సంజ‌య్ జా, వీ హ‌నుమంత‌రావుకు కూడా క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన విష‌యం విదిత‌మే. క‌రోనా నుంచి కోలుకున్న ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ కు క‌రోనా నెగిటివ్ వ‌చ్చింది. ఆయ‌న కూడా ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి కానున్నారు.


logo