శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 23, 2020 , 02:20:12

69 లక్షల పోస్టులు పడ్డాయి.. దరఖాస్తు చేసుకోండి!

69 లక్షల పోస్టులు పడ్డాయి.. దరఖాస్తు చేసుకోండి!

న్యూఢిల్లీ: ట్రంప్‌ పర్యటన కోసం చేస్తున్న ఏర్పాట్లపై కాంగ్రెస్‌ విమర్శల వర్షం గుప్పిస్తున్నది. ‘డొనాల్డ్‌ ట్రంప్‌ నాగరిక్‌ అభినందన్‌ సమితి’ పేరుతో కమిటీని ఏర్పాటుచేసి రూ.వంద కోట్లు కేటాయించడంపై పలు ప్రశ్నలు కురిపించింది. కాంగ్రెస్‌ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ఓ వ్యంగ్య ప్రకటన ఇచ్చింది. 24న నమస్తే ట్రంప్‌ సభలో చేతులు ఊపేందుకు 69 లక్షల మందిని నియమించుకుంటున్నామని, భత్యంగా ‘మంచి రోజులు’ (అచ్చేదిన్‌) వస్తాయని అందులో పేర్కొన్నది. ‘మోదీ ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాల హామీలో 69 లక్షలకు నోటిఫికేషన్‌ వచ్చింది. దరఖాస్తు చేసుకోండి’ అని ట్వీట్‌ చేసింది. మరోవైపు ట్రంప్‌ పర్యటన కోసం రూ.100 కోట్లు కేటాయించి, ఓ కమిటీ ద్వారా ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్‌ ప్రధా న కార్యదర్శి ప్రియాంక విమర్శించారు. కాంగ్రెస్‌ విమర్శలపై బీజేపీ స్పందిస్తూ.. భారత్‌-అమెరికా సంబంధాల్లో ఈ పర్యటన మైలురాయిగా నిలిచిపోతుందని, ఈ విజయాన్ని అభినందించాలని కోరింది.


logo