బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 10, 2020 , 14:34:09

కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న ప‌డ‌వ‌: గుజ‌రాత్ సీఎం విజ‌య్‌రూపానీ

కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న ప‌డ‌వ‌: గుజ‌రాత్ సీఎం విజ‌య్‌రూపానీ

అహ్మ‌దాబాద్: ‌కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న ప‌డ‌వ అని గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి, బీజేపీ నేత విజ‌య్‌రూపానీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత‌లు ప్ర‌జ‌ల‌తో సంబంధాలు కోల్పోయార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. దేశంలో ఉపఎన్నిక‌లు జ‌రిగిన అన్ని రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీని తిర‌స్క‌రించార‌ని విజ‌య్‌రూపానీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎక్క‌డ చూసినా నాయ‌కుల కొర‌త ఉంద‌న్నారు. గుజ‌రాత్‌లో 8 స్థానాల‌కు ఉపఎన్నిక‌లు జ‌రిగితే ప్ర‌స్తుతం అన్ని స్థానాల్లోనూ బీజేపీయే ముందంజ‌లో ఉంద‌ని విజ‌య్ రూపానీ చెప్పారు. గుజ‌రాత్‌లో జ‌రుగ‌బోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ఈ ఎన్నిక‌ల‌కు ట్ర‌య‌ల‌ర్ లాంటివ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.