శనివారం 23 జనవరి 2021
National - Jan 13, 2021 , 14:02:03

దేశ‌భ‌క్తుల‌ను దూషించ‌డ‌మే కాంగ్రెస్ పని: ప‌్ర‌జ్ఞా ఠాకూర్‌

దేశ‌భ‌క్తుల‌ను దూషించ‌డ‌మే కాంగ్రెస్ పని: ప‌్ర‌జ్ఞా ఠాకూర్‌

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ దేశభక్తులను దూషిస్తున్న‌ద‌ని, దేశ‌భ‌క్తుల‌ను దూషించ‌డ‌మే ఆ పార్టీ ప‌నిగా పెట్టుకున్న‌ద‌ని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఇటీవల నాథూరాం గాడ్సేను మొద‌టి ఉగ్రవాదిగా అభివర్ణించిన నేపథ్యంలో ఆమె కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ బుధవారం మీడియాతో మాట్లాతుండ‌గా.. కొంద‌రు మీడియా ప్ర‌తినిధులు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను ప్ర‌స్తావించ‌డంతో ఆమె స్పందించారు.

కాంగ్రెస్ ఎప్పుడూ దేశభక్తులను దూసిస్తుంటుంది. దిగ్విజ‌య్ సింగ్ కాషాయ ఉగ్రవాదం అని వ్యాఖ్యానించారు. అంతకన్నా తీవ్రమైన విషయం ఇంకేమైనా ఉంటుందా అని ప్ర‌జ్ఞా ప్రశ్నించారు. ఇటీవ‌ల‌ గ్వాలియర్‌లో అఖిల భారతీయ హిందూమహాసభ గాడ్సే పేరు మీద ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. గాడ్సేను తొలి‌ ఉగ్రవాదిగా పేర్కొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo