బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 13, 2020 , 14:34:01

ప్ర‌త్యేక‌ రైల్వే బ‌డ్జెట్‌తో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించారు..

ప్ర‌త్యేక‌ రైల్వే బ‌డ్జెట్‌తో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించారు..

హైద‌రాబాద్‌:  కేవ‌లం ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు.. గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైల్వే బ‌డ్జెట్‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌వేశ‌పెట్టేద‌ని ఇవాళ రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ తెలిపారు. రైల్వే అంశంపై లోక్‌స‌భ‌లో చ‌ర్చ జ‌రిగిన త‌ర్వాత మంత్రి కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు.  స‌ప‌రేటు రైల్వే బ‌డ్జెట్ కేవ‌లం బెలూన్ మాత్ర‌మే అని,  కేవ‌లం చ‌ప్ప‌ట్ల కోస‌మే ఆ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టేవార‌ని మంత్రి విమ‌ర్శించారు.  ప్ర‌భుత్వాలు చేసిన ఫేక్ ప్ర‌క‌ట‌న‌లు.. ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించాయ‌న్నారు.  1974 నుంచి ప్ర‌క‌టించిన ప‌లు రైల్వే ప్రాజెక్టులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయ‌న్నారు.  రైల్వే అంశంపై లోక్‌స‌భ‌లో సుమారు 11 గంట‌ల పాటు చ‌ర్చ చేప‌ట్టారు.   2013-14లో రైల్వే బ‌డ్జెట్ కోసం 54 వేల కోట్లు కేటాయించామ‌ని,  ఇప్పుడు ఆ బ‌డ్జెట్‌ను 1.61 ల‌క్ష‌ల కోట్ల‌కు పెంచిన‌ట్లు చెప్పారు.  పెంచిన బ‌డ్జెట్‌ను 58 సూప‌ర్ క్రిటిక‌ల్‌, 68 క్రిటిక‌ల్ ప్రాజెక్టుల‌కు వినియోగిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.  రైల్వే లైన్ విద్యుత్తీక‌ర‌ణ టార్గెట్‌ను చేరుకున్నామ‌న్నారు.  రైల్వే పెన్ష‌న్ల విష‌యంలోనూ గ‌త ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యం వ‌హించిన‌ట్లు మంత్రి తెలిపారు.  

 

  


logo