బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 12:55:05

స్థిరంగానే ఉన్నాం.. స‌చిన్ వెన‌క్కి రావాలి : ర‌ణ్‌దీప్ సుర్జేవాలా

స్థిరంగానే ఉన్నాం.. స‌చిన్ వెన‌క్కి రావాలి : ర‌ణ్‌దీప్ సుర్జేవాలా

హైద‌రాబాద్‌: రాజ‌స్థాన్‌లోని సీఎం అశోక్ గెహ్లాట్ ప్ర‌భుత్వం స్థిరంగా ఉన్న‌ట్లు కాంగ్రెస్ నేత ర‌ణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం పూర్తి కాలం ప‌నిచేస్తుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.  జైపూర్‌లో జ‌రిగిన స‌మావేశం త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడారు.  బీజేపీ చేస్తున్న కుట్ర రాజ‌కీయాల‌తో త‌మ ప్ర‌భుత్వం కుప్ప‌కూలిపోద‌న్నారు.  ఒక‌వేళ ఎవ‌రైనా కుటుంబంలో మ‌న‌స్తాపానికి లోను అయితే, వారు ఆ కుటుంబ‌సభ్యుల‌తో మాట్లాడి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని సుర్జేవాలా సూచించారు. కాంగ్రెస్ నాయ‌క‌త్వం త‌ర‌పున‌, సోనియా, రాహుల్ త‌ర‌పున తాను ఈ వ్యాఖ్య‌లు చేస్తున్న‌ట్లు సుర్జేవాలా చెప్పారు. స‌చిన్ పైల‌ట్ కానీ ఆయ‌న మ‌ద్ద‌తుదారుల‌కు  కాంగ్రెస్ పార్టీ ద్వారాలు ఎప్ప‌టికే తెరిచే ఉంటాయ‌ని సుర్జేవాలా తెలిపారు. 

అయితే బీజేపీలో మాత్రం చేర‌డం లేద‌ని ఓ మీడియాకు స‌చిన్ పైల‌ట్ క్లారిటీ ఇచ్చారు.  రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీరు ప‌ట్ల డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్ అసంతృప్తితో ఉన్నారు.  ఓ కేసులో త‌న‌కు కూడా నోటీసులు ఇవ్వ‌డాన్ని ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. దీంతో రాజ‌స్థాన్ రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డింది. 

 logo