ఆదివారం 29 మార్చి 2020
National - Mar 09, 2020 , 14:34:14

కాంగ్రెస్‌ లీడర్‌ లేటు వయసులో ఘాటు పెళ్లి

 కాంగ్రెస్‌ లీడర్‌ లేటు వయసులో ఘాటు పెళ్లి
  • 60వ ఏట పెళ్లి చేసుకున్న ముకుల్‌ వాస్నిక్‌

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ముకుల్‌ వాస్నిక్‌ ఓ ఇంటి వాడయ్యారు. వాస్నిక్‌ తన 60వ ఏట పెళ్లి చేసుకున్నారు. తన పాత స్నేహితురాలైన రవీనా ఖురానాను ఆదివారం వివాహమాడారు. ఢిల్లీలో జరిగిన వాస్నిక్‌ వివాహ వేడుకకు రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌, రాజ్యసభ ఎంపీ అహ్మద్‌ పటేల్‌తో పాటు పలువురు నాయకులు హాజరై ఆ నూతన దంపతులను ఆశీర్వదించారు. వాస్నిక్‌ దంపతులకు రాజస్థాన్‌ సీఎం హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. మనీష్‌ తివారీ కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ఈ దంపతులను భగవంతుడు చల్లగా చూడాలని పేర్కొన్నారు.logo