శనివారం 28 మార్చి 2020
National - Mar 10, 2020 , 12:54:28

అందుకే కాంగ్రెస్‌కు రాజీనామా చేశా..: సింధియా

అందుకే కాంగ్రెస్‌కు రాజీనామా చేశా..: సింధియా

న్యూఢిల్లీ:  ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. 18ఏండ్లుగా కాంగ్రెస్‌ పార్టీకి సేవలందించిన సింధియా మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ వైఖరితో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్న సింధియా కీలక అంశాలను లేఖలో పేర్కొన్నారు. 

'కాంగ్రెస్‌లో ఉండి దేశానికి ఏమీ చేయలేకపోతున్నా..అందుకే కాంగ్రెస్‌కు రాజీనామా చేశాను. కాంగ్రెస్‌లో సముచిత స్థానం లభించలేదు. ఏడాదికాలంగా పార్టీని వీడాలనుకుంటున్నా. మొదటి నుంచి రాష్ట్రానికి, దేశానికి సేవచేయాలనేదే నా కోరిక, కానీ  కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పని చేయలేకపోతున్నాను. కాంగ్రెస్‌లో తనకు సహకరించిన అందరికీ   కృతజ్ఞతలు.  భవిష్యత్‌ను నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందని' సింధియా పేర్కొన్నారు.  

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఏ మాత్రం ఉపేక్షించకూడదని  కాంగ్రెస్‌ అధిష్టానం హెచ్చరించింది. జ్యోతిరాదిత్యను పార్టీ నుంచి బహిష్కరించినట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందునే బహిష్కరిస్తున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. logo