గురువారం 21 జనవరి 2021
National - Dec 22, 2020 , 14:54:41

బీజేపీ నేత‌కు పార్టీ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టిన కాంగ్రెస్‌

బీజేపీ నేత‌కు పార్టీ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టిన కాంగ్రెస్‌

భోపాల్: కాంగ్రెస్ పార్టీ ఎలాంటి దుస్థితిలో ఉందో చెప్పేందుకు ఈ ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. ఎప్పుడో 9 నెల‌ల కింద‌ట పార్టీ వీడి బీజేపీలోకి వెళ్లిపోయిన నేత‌కు ఓట్లు వేసి మ‌రీ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది మ‌ధ్య‌ప్ర‌దేశ్ కాంగ్రెస్‌. విష‌యం తెలిసిన వెంట‌నే ఆయ‌న ఎన్నిక‌ను ర‌ద్దు చేసినా.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితుల‌ను ప‌ట్టించుకోకుండా ఆ పార్టీ ప‌ని చేస్తున్న తీరు విస్మ‌యం క‌లిగిస్తోంది. గ‌త మార్చి నెల‌లో జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో ప‌లువురు పార్టీ ఎమ్మెల్యేలు, నేత‌లు కాంగ్రెస్‌ను వీడిన సంగ‌తి తెలిసిందే. అందులో హ‌ర్షిత్ సింఘాయ్ కూడా ఒక‌రు. ఈయ‌న ఆ త‌ర్వాత బీజేపీలో చేరారు. కానీ గ‌త శుక్ర‌వారం యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎన్నికైనందుకు శుభాకాంక్ష‌లు అంటూ త‌న‌కు సందేశాలు రావ‌డం చూసి ఆయ‌న కంగుతిన్నారు. 

ఈ ఎన్నిక‌ల్లో సింఘాయ్ 12 ఓట్ల తేడాతో గెల‌వ‌డం విశేషం. 9 నెల‌ల కిందే పార్టీని వీడి వెళ్లిపోయిన నేత‌కు ఓట్లు వేశారంటేనే కాంగ్రెస్ ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ ఎన్నిక‌ల్లో ఎవ‌రికీ ఆస‌క్తి లేదు. అయినా నేను ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎన్నిక‌య్యాను. మార్చి 10వ తేదీన నేను కాంగ్రెస్ పార్టీని వీడాను. చివ‌రిసారి నేను మూడేళ్ల కింద‌టే యూత్ కాంగ్రెస్ ఎన్నిక‌ల్లో పోటీ చేశాను అని సింఘాయ్ చెప్పారు. మూడేళ్ల కింద‌ట తాను నామినేష‌న్ ప‌త్రాలు స‌మ‌ర్పించాన‌ని, త‌ర్వాత రెండుసార్లు వాయిదా ప‌డిన ఎన్నిక‌లు ఇప్పుడు జ‌రిగాయ‌ని ఆయ‌న తెలిపారు. ఈ మ‌ధ్య‌లో తాను నామినేష‌న్ ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు పార్టీకి చెప్పినా పైనుంచి ఎలాంటి స్పంద‌నా లేద‌ని సింఘాయ్‌ అన్నారు. 

ఇవి కూడా చదవండి..

జోష్‌కు జోష్‌.. గూగుల్‌, మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు

నేను వెళ్తున్నా..మీ సత్తా చాటండి:కోహ్లీ

ఏడేండ్ల క్రితం యాక్సిడెంట్‌.. దక్కిన కోటి పరిహారం

57,000 ఏళ్లనాటి తోడేలు కళేబరం అట్లాగే ఉందట..!

ఆ దేశంలో ఏప్రిల్ త‌ర్వాత తొలి క‌రోనా కేసు న‌మోదు


logo