గురువారం 28 జనవరి 2021
National - Dec 17, 2020 , 19:32:11

సోనియాతో రేపు కాంగ్రెస్‌ ‘రెబెల్‌’ నేతల భేటీ

సోనియాతో రేపు కాంగ్రెస్‌ ‘రెబెల్‌’ నేతల భేటీ

న్యూఢిల్లీ‌:  నాయకత్వం పనితీరుపై అసంతృప్తితోపాటు సంస్థాగత మార్పులు తేవాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధినేత సోనియాగాంధీకి లేఖ రాసిన ఆ పార్టీ అసమ్మతి నేతలు శనివారం ఆమెతో భేటీ కానున్నారు. దీనికి మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ సమన్వయకర్తగా వ్యవహరించారని సమాచారం. సోనియాకు గత ఆగస్టులో రాసిన లేఖపై గులాంనబీ ఆజాద్‌, కపిల్‌ సిబాల్‌లతోపాటు 23 మంది నేతలు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. 

సదరు లేఖ రాసిన అసమ్మతి నేతలంతా హాజరవుతున్నారా? లేదా? అన్న సంగతి తెలియరాలేదు. అసమ్మతి నేతల తరపున ఐదారుగురు నేతల బృందం సోనియాగాంధీతో సమావేశమై తమ ముందు ఉన్న ఆందోళనను ఆమె దృష్టికి తేనున్నారని తెలిసింది. అసమ్మతి నేతలతో సయోధ్య కోసమే అధిష్ఠానం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. 

ఈ సమావేశంలో రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ పాల్గొంటారా? లేదా? అన్న సంగతి తెలియరాలేదు. కానీ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం అధికారికంగా ఇది సోనియా-రెబెల్స్‌ నేతల భేటీ అని పేర్కొనలేదు. ఆగస్టు ‘అసమ్మతి’ లేఖపై సంతకం చేయని నేతలు కూడా పాల్గొంటారని వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo