శుక్రవారం 27 నవంబర్ 2020
National - Oct 30, 2020 , 17:29:14

‘సీఎం, డిప్యూటీ సీఎంను సస్పెండ్‌ చేయండి..’

‘సీఎం, డిప్యూటీ సీఎంను సస్పెండ్‌ చేయండి..’

పాట్నా: బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, డిప్యూటీ సీఎం సుశీల్‌ మోదీని సస్పెండ్‌ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా డిమాండ్‌ చేశారు. ముంగేర్ కాల్పుల ఘటనపై ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ బృందం బీహార్‌ గవర్నర్‌ ఫాగు చౌహాన్‌ను శుక్రవారం కలిసింది. అనంతరం సుర్జేవాలా మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు కారణమైన సీఎం నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. కాల్పుల్లో మరణించిన బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కోరినట్లు చెప్పారు.  

ముంగేర్  జిల్లాలో గురువారం దుర్గామాత విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా ఉత్స‌వాల్లో పాల్గొన్న‌వారికి పోలీసులకు మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి చనిపోవడంతో ఆందోళన కారులు రెచ్చిపోయారు. పురబ్ సరాయ్, బసుదేవ్‌పూర్ పోలీస్‌ అవుట్‌ పోస్టులకు నిప్పుపెట్టారు. ఎస్పీ కార్యాలయంతోపాటు పలు పోలీస్‌ స్టేషన్లపై దాడి చేశారు. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో పోలీస్‌ సిబ్బంది ప్రాణ భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై స్పందించిన ఈసీ జిల్లా మెజిస్ట్రేట్‌తోపాటు ముంగేర్  జిల్లా ఎస్పీని తొలగించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.