బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 02:26:29

దవాఖానలో చేరిన కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా!

దవాఖానలో చేరిన కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా!

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం రాత్రి 7 గంటలకు ఢిల్లీలోని సర్‌ గంగారాం దవాఖానలో చేరారు. రోజువారీ వైద్య పరీక్షల కోసం ఆమె దవాఖానలో అడ్మిట్‌ అయ్యారని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని సర్‌ గంగారాం దవాఖాన చైర్మన్‌ డాక్టర్‌ డీఎస్‌ రాణా తెలిపారు. ఛాతీ, శ్వాసకోశ రోగాల నివారణ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ అరూప్‌ కుమార్‌ బసు పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతున్నారని సర్‌ గంగారాం దవాఖాన బులెటిన్‌ వెల్లడించింది.  

కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీలతో సోనియా భేటీ

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం పార్టీ రాజ్యసభ సభ్యులతో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. వచ్చే నెలలో పార్లమెంటు వర్షకాల సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఎలా వ్యవహరించాలన్నదానిపై చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, సీనియర్‌ నేతలు ఏకే ఆంటోని, అహ్మద్‌ పటేల్‌, గులాం నబీ ఆజాద్‌, చిదంబరం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.  


logo