శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 27, 2021 , 19:42:42

అమిత్‌ షా పదవికి రాజీనామా చేయాలి : రణదీప్‌ సూర్జేవాలా

అమిత్‌ షా పదవికి రాజీనామా చేయాలి : రణదీప్‌ సూర్జేవాలా

న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి పదవికి అమిత్‌ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌ చేసింది. మంగళవారం ఢిల్లీలో ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో షాను ఆ పార్టీ తప్పుపట్టింది. ఇంటెలిజెన్స్‌ వైఫల్యంతోనే ఘటన జరిగిందని, ఎర్రకోటలోని దుండగులను అనుమతించిన కేంద్ర హోంమంత్రిని పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా డిమాండ్‌ చేశారు. గతేడాది దేశ రాజధానిలో జరిగిన అల్లర్ల ఘటననూ గుర్తు చేశారు. షాను పదవి నుంచి తొలగించకపోతే ప్రధాని నరేంద్ర మోదీ తనను రక్షిస్తున్నారని భావించాల్సి వస్తుందనని పేర్కొన్నారు. దండుగులపై చర్యలు తీసుకోకుండా.. రైతులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని విమర్శించారు. ఎర్రకోట ఘటనలో ప్రమేయం ఉన్న నటుడు, యాక్టివిస్ట్ దీప్ సిద్ధూకు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. రైతు సంఘాలు, వారి ఆందోళనలను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రలో ఆయన ప్రమేయం ఉందని అర్థమవుతోందని ఆరోపించారు. 

VIDEOS

logo