బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 15, 2020 , 21:51:13

‘మహాకూటమికి సంకెళ్లుగా కాంగ్రెస్‌ మారింది..’

‘మహాకూటమికి సంకెళ్లుగా కాంగ్రెస్‌ మారింది..’

పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రాణించకపోవడంపై ఆర్జేడీ నేతలు మండిపడుతున్నారు. మహాకూటమికి కాంగ్రెస్‌ సంకెళ్ల మాదిరిగా మారిందని ఆ పార్టీ నేత శివానంద్‌ తివారీ విమర్శించారు. ఎన్నికల్లో 70 మంది అభ్యర్థులను నిలబెట్టినా ఆ మేరకు ర్యాలీలు నిర్వహించలేదని మండిపడ్డారు. రాహుల్ గాంధీ కేవలం 3 రోజులు మాత్రమే ప్రచారం చేశారని, ప్రియాంక గాంధీ అసలు ప్రచారంలోనే పాల్గొనలేదని దుయ్యబట్టారు. 

మరోవైపు బీహార్ గురించి తెలియని కాంగ్రెస్‌ నేతలు ప్రచారంలో పాల్గొన్నారని, ఇది సరైన పద్ధతి కాదని శివానంద్ తివారీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పరాజయం కేవలం బీహార్‌కు మాత్రమే పరిమితం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ గరిష్ట సంఖ్యలో పోటీ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, కాని గరిష్ట సంఖ్యలో సీట్లను గెలుచుకోవడంలో ఆ పార్టీ విఫలమవుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ దీనిని గురించి ఆలోచించాలని శివానంద్ తివారీ హితవు పలికారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి