బుధవారం 03 జూన్ 2020
National - May 17, 2020 , 17:26:35

135 బస్సుల్లో కార్మికులు..అనుమతివ్వని యూపీ సర్కార్

135 బస్సుల్లో కార్మికులు..అనుమతివ్వని యూపీ సర్కార్

రాజస్థాన్ : రాజస్థాన్ లో చిక్కుకున్న వలస కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ 135 బస్సులను ఏర్పాటు చేసింది. వలస కార్మికులను తీసుకెళ్లేందుకు బస్సులు యూపీ-రాజస్థాన్ సరిహద్దులోని బహజ్, భరత్ పూర్ ప్రాంతాలకు చేరుకున్నాయి. అయితే యూపీ ప్రభుత్వం బస్సులను అనుమతించడం లేదు.

ఈ నేపథ్యంలో రాజస్థాన్ మంత్రి సుభాష్ గార్గ్ మాట్లాడుతూ..ప్రియాంకాగాంధీ వలస కార్మికులు, కూలీల కోసం బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. తమకు అనుమతి ఇవ్వాలని ప్రియాంకాగాంధీ యూపీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో అర్థం కావడం లేదని అన్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo