మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 16:20:29

కాంగ్రెస్‌కు గట్టి నాయకత్వం అవసరం : ఎంపీ రంజిత్‌ రంజన్‌

కాంగ్రెస్‌కు గట్టి నాయకత్వం అవసరం : ఎంపీ రంజిత్‌ రంజన్‌

న్యూఢిల్లీ : ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి నాయకత్వం అవసరమని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు, పార్లమెంట్‌ సభ్యురాలు  రంజిత్‌ రంజన్‌ అన్నారు. గురువారం జరిగిన పార్టీ రాజ్యసభ సభ్యుల సమావేశంలో పార్టీలో 'అనుభవజ్ఞనులు వర్సెస్ యువత' అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చిందని తెలిపారు. పార్టీని మార్చగల శక్తి ఉన్న వ్యక్తులు కాంగ్రెస్లో ఉండాలని అన్నారు. ‘ఆ సమావేశంలో నేను లేను. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ప్రధాన చర్చ పార్టీలో అనుభవజ్ఞనులు, యువతకు సంబంధించిన మాత్రం కాదు. కచ్చితమైన నాయకత్వం ఉంటేనే కార్యకర్తలు నాయకత్వం చెప్పిన విధంగా నడుచుకుంటారు.

అందుకే కాంగ్రెస్కు కచ్చితమైన నాయకత్వం అవసరం’ అని  ఆమె అన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే నాయకత్వంతోపాటు కార్యకర్తలు తమకు అవసరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఏర్పాటు చేసిన రాజ్యసభ ఎంపీల సమావేశంలో కాంగ్రెస్తో ప్రజలు విభేదిస్తున్నందున పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని కొందరు సీనియర్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సచిన్‌ పైలెట్‌, జ్యోతిరాధిత్య సింథియా లాంటి యువ నేతలు పార్టీని వీడడంతో వెనకడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 


logo