బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 02, 2020 , 21:41:02

కమలా నెహ్రూ సొసైటీపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఫిర్యాదు

కమలా నెహ్రూ సొసైటీపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఫిర్యాదు

లక్నో: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌ రాయబలేరిలోని కమలా నెహ్రూ ఎడ్యుకేషనల్ సొసైటీపై సొంత పార్టీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. అనేక మంది ప్రముఖ కాంగ్రెస్ నేతలు సభ్యులుగా ఉన్న ఈ సొసైటీలో నిధుల అవకతవకలపై దర్యాప్తు జరుపాలని రాయబలేరి ఎమ్మెల్యే అదితి సింగ్‌ డిమాండ్ చేశారు. సోనియా కుటుంబానికి నమ్మకస్తులైన షీలా కౌల్‌ వంటి వారు సభ్యులుగా ఉన్నారని ఆమె విమర్శించారు. సొసైటీ బై లాస్‌లో పేర్కొన్న విధంగా కేటాయించిన భూమిలో బాలికల కోసం పాఠశాల లేదా కాలేజిని నిర్మించలేదన్నారు.

ఆ భూమి సొసైటీ ఆధీనంలో లేదని, ప్రస్తుతం దానిని అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయని అదితి సింగ్‌ ఆరోపించారు. పీఎం కేర్స్‌ నిధుల గురించి ప్రశ్నించేవారు ఈ సొసైటీకి ఏం చేశారన్నది చెప్పాలంటూ పరోక్షంగా రాహుల్‌పై విమర్శలు చేశారు. కమలా నెహ్రూ ఎడ్యుకేషనల్ సొసైటీలో కోట్లలో  జరుగుతున్న నిధుల అవకతవకలపై దర్యాప్తు జరుపాలని కోరుతూ ఆర్థిక నేర విభాగం, సీఎం కార్యాలయం, హోంశాఖకు సోమవారం లేఖ రాసినట్లు ఆమె చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.