ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 14, 2020 , 13:21:35

ఘజియాబాద్‌ మాజీ ఎంపీ ఎస్‌పీ గోయల్‌ మృతి

ఘజియాబాద్‌ మాజీ ఎంపీ ఎస్‌పీ గోయల్‌ మృతి

న్యూఢిల్లీ : కరోనా బారినపడి చికిత్స పొందుతున్న కాంగ్రెస్‌ నాయకుడు, ఘజియాబాద్‌ మాజీ ఎంపీ సురేంద్ర ప్రకాశ్‌ గోయల్‌ శుక్రవారం మృతి చెందారు. ఆయన మృతికి విశ్రాంత కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ జనరల్‌ వీకే సింగ్‌ సంతాపం తెలిపారు. ‘సురేశ్‌ ప్రకాశ్‌ సింగ్‌ మృతి తీవ్రంగా కలచివేసింది. ఎంపీగా ఆయన ఘజియాబాద్‌కు ఎనలేని సేవలందించారు. ఆయన మృతి తీరని లోటు. సింగ్‌ ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. గోయల్‌ మృతికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన పలువురు కాంగ్రెస్‌ ముఖ్యనాయకులు సైతం సంతాపం ప్రకటించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.


logo