బుధవారం 03 జూన్ 2020
National - May 11, 2020 , 00:50:39

భారత్‌, చైనా బలగాల ఘర్షణ

భారత్‌, చైనా బలగాల ఘర్షణ

  • ఇరుదేశాల సైనికుల్లో పలువురికి గాయాలు
  • లడఖ్‌, ఉత్తర సిక్కిం సెక్టార్‌లో ఘటనలు

న్యూఢిల్లీ, మే 10: భారత్‌, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. తూర్పు లడఖ్‌తోపాటు, ఉత్తర సిక్కిం సెక్టార్‌లోని నకులా పాస్‌ వద్ద ఇరువర్గాలు బాహాబాహీకి దిగినట్లు తెలిపారు. లడఖ్‌లోని పాన్‌గాంగ్‌ సరస్సు వెంబడి ఈ నెల 5న సాయంత్రం రెండు దేశాలకు చెందిన దాదాపు 200 మంది సైనికులు ఘర్షణకు దిగారని, ఈ ఘటనలో ఇరువైపులా పలువురికి గాయాలయ్యాయని చెప్పారు. 2017 ఆగస్టులో పాన్‌గాంగ్‌ సరస్సు వద్ద ఇరుదేశాల బలగాల మధ్య ఘర్షణ జరుగగా, ఆ తర్వాత మళ్లీ గొడవ జరుగడం ఇదే తొలిసారి. మరోవైపు, నకులా పాస్‌ వద్ద జరిగిన ఘర్షణలో దాదాపు 150 మంది పాల్గొన్నారని అధికారులు చెప్పారు. ముందుగా మాటల యుద్ధానికి తెరలేపిన బలగాలు.. ఆపై పిడుగుద్దులకు దిగడంతో రెండు దేశాలకు చెందిన పలువురు గాయపడ్డారని పేర్కొన్నారు. logo