న్యూఢిల్లీ: దాదాపు 53.3 కోట్ల మంది ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారం ఆన్లైన్లో కనిపించడం కలకలంరేపింది. ఈ సమాచారం తేలిగ్గా పొందేలా ఓ వెబ్సైట్లో హ్యాకర్లు ఈ వివరాల్ని ఉంచారని వార్తలొచ్చాయి. ఇందులో 106 దేశాల ఫేస్బుక్ ఖాతా దారుల ఐడీలు, పూర్తి పేర్లు, ప్రాంతాలు, పుట్టిన తేదీలు, ఈ-మెయిల్ ఐడీలు, చిరునామాలు ఉన్నట్లు తెలిపింది.
డేటా లీక్‌లో 60 లక్షల మంది భారతీయ ఖాతాదారుల డేటా ఉంది. భారత్‌తోపాటు అమెరికా, బ్రిటన్ దేశాల యూజర్ల ఖాతాల సమాచారం బహిర్గతమైంది. 3.2 కోట్ల మంది అమెరికన్లు, 1.1 కోట్ల మంది బ్రిటన్ ఖాతాదారుల డేటా లీకయింది.
కానీ ఈ సమాచారమంతా పాతదేనని సైబర్ నిపుణులు తెలిపారు. అయితే, ఈ ఘటన సోషల్ మీడియా వేదికల యూజర్ల సమాచార భద్రతపై సందేహాలకు నిదర్శనంగా మారుతున్నది. అమెరికాకు చెందిన 267 మిలియన్ల వినియోగదారుల సమాచారం ఆన్లైన్లో ఉన్నట్లు 2019 డిసెంబర్ నెలలో ఉక్రెయిన్ సెక్యూరిటీ రీసెర్చర్ వెల్లడించారు. తాజాగా లభ్యమైన సమాచారానికీ.. దీనికీ సంబంధం ఉందా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
గతంలో 87 మిలియన్ల ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారం అక్రమంగా కేంబ్రిడ్జి అనలైటికా చేతికి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ఫేస్బుక్ 2018లో ఓ కొత్త ఫీచర్‌ను తెచ్చింది.
దీంతో ఫోన్‌నెంబర్ ఆధారంగా వినియోగదారుల సమాచారం కనిపించకుండా చేసింది. ఇది 2019లో లీక్ అయిన సమాచారం మాత్రమేనని ఫేస్బుక్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
కరోనా ఎఫెక్ట్ : జమ్మూకశ్మీర్‌లో పాఠశాలల మూసివేత
పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు మరింత తగ్గుతాయి: ధర్మేంద్ర ప్రధాన్
రిలయన్స్-ఫ్యూచర్ డీల్‌కు 6 నెలల గడువు
వేదాంత కెయిర్న్‌తో జగడం.. లాభాల రికవరీకి కేంద్రం నోటీసు